Header Banner

జీవో నెం 3 పునరుద్దనపై భేటీ! వంద శాతం ఛాన్స్ వారికే!

  Tue May 13, 2025 08:14        Politics

ఏజన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్ కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు గిరిజన సంక్షేమశాఖ అధికారులతో ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. 2000లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీవో నంబర్‌ 3 జారీ చేసి ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు 100% రిజర్వేషన్లు కల్పించిందని గుర్తుచేశారు.

 

 
 
అయితే 2020లో సుప్రీంకోర్టు ఆ జీవోను రద్దు చేసిన విషయం తెలిపారు. గత ప్రభుత్వం ఈ విషయంలో సమీక్ష పిటిషన్ వేయడంలో నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. దాంతో గిరిజనులు ఈ జీవో ద్వారా లభించే ప్రయోజనాలను కోల్పోయారన్నారు. జీవో 3 పునరుద్ధరణకు న్యాయపరంగా ఉన్న అవకాశాలు, అడ్డంకులపై అధికారులతో సీఎం చర్చించారు. ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు, వారిని మళ్లీ ఆ లబ్ధి పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.


ఇది కూడా చదవండిఏపీకి కేంద్రం మరో బంపరాఫర్..! ఏకంగా రూ. వేలకోట్ల ప్రాజెక్టు ఆ జిల్లాకే పక్కా..!
 
ఇందులో భాగంగా గిరిజనులు, సంఘాల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే, సుప్రీంకోర్టు తీర్పులు, రాజ్యాంగ నిపుణుల సలహాలు తీసుకొని ముందుకు సాగాలన్నారు. అయితే అధికారులు సీఎం చంద్రబాబుకు మూడు ఆప్షన్స్ వివరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 100% రిజర్వేషన్లు కొనసాగించడం.. గిరిజన జనాభా శాతానికి అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించడం.. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 50% మించకుండా రిజర్వేషన్లు ఇచ్చి హక్కులు కాపాడడమనీ స్పష్టం చేశారు.


 
దీనిపై సీఎం స్పందిస్తూ.. గిరిజనుల హక్కులకు పూర్తిగా కట్టుబడి ఉన్నామన్నారు. ఏ ఒక్క అవకాశం అయినా వదులుకోకుండా న్యాయం చేయడమే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు. విద్య, వైద్యం లాంటి రంగాల్లో కూడా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తూ వారి జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #GO3 #MeetingOnGO3 #ReservationPolicy #JusticeForEligible #100PercentDeserving #SocialJustice